సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, మార్చి 9 : తెలంగాణ యువత కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు చేపడుతామని ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ సీఎం చాంబర్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని యువతకు అన్యాయం జరిగిందన్నారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లక్ష వరకు ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, మరో 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని క్రమబద్ధీకరించడంతో వేలాది మందికి మేలు జరుగుతుందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిరుద్యోగులంతా అండగా ఉంటారని ఎమ్మెల్యే రమేశ్ తెలిపారు.