
భావితరాలకు పండుగల విశిష్టత తెలియజేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సు రంగలీల మైదానంలో మంగళవారం రాత్రి నరకాసుర వధ నిర్వహించారు. నరకాసుర వధ కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రజలు పాల్గొన్నారు.
కరీమాబాద్, నవంబర్ 2 : పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉర్సు రంగలీలా మైదానంలో కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నరకాసురవధ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా జరుగని విధంగా ఉర్సు రంగలీలా మైదానంలో నరకాసురవధ జరగడం సంతోషకరమన్నారు. ఉత్సవాలకు అండ గా ఉంటానన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఉత్సవాలకు బల్దియా తరుపున అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ఉత్సవాలకు అండగా ఉంటామన్నారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వేడుక నిర్వహిస్తున్నామన్నారు. కమిటీ సభ్యులు సమష్టిగా పని చేశారన్నారు. దాతల సహకారం మరువలేనిదని, సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకే నరకాసురవధ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ నరకాసుర ప్రతిమకు నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు పల్లం రవి, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, పోశాల పద్మ, గుండు చందన, వేల్పుగొండ సువర్ణ, రజిత, ఉత్సవ కమిటీ సభ్యులు శతపతి శ్యాలరావు, కనుకుంట్ల రవి, వనం మధు, ఆవునూరి రామ్మూర్తి, వనం కుమార్, మరుపల్ల గౌతమ్, మాటేటి శ్యామ్, మిరియాల ఆదిత్య, వంగరి సురేశ్, అన్న కుమారస్వామి, మరుపల్ల శివ, అంకం రామనాథం, తౌటం నర్సింహ, కొమ్ము రాజు, పోలం రంజిత్, కనుకుంట్ల శివసాయి, కంది అఖిల్‌సాయి పాల్గొన్నారు.
కనులపండువగా నరకాసురవధ ఉర్సు రంగలీల మైదానంలో నరకాసురవధ భారీ జనసందోహం మధ్యన కనుల పండువలా జరిగింది. 55 అడుగుల భారీ ప్రతిమకు అమర్చిన పటాకుల శబ్ధాలు, తారాజువ్వల వెలుగులు అబ్బురపరిచాయి. ఉర్సు కురుమవాడలో నుంచి శ్రీకృష్ణ-సత్యభామ వేషధారణలో కళాకారులను డప్పు వాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగింపుగా ఉర్సు రంగలీల మైదానానికి తీసుకువచ్చారు. ఉత్సవ నిర్వహణకు సహకరించిన దాతలను కమిటీ సత్కారం నిర్వహించింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.