చిట్యాల: కరోనా వాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసి వందశాతం వాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. గురువారం మండలంలోని ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేటలో నిర్వహించిన వాక్సినేషన్ డ్రైవ్‌ను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ..18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలన్నారు. వాక్సిన్‌పై ఎటువంటి అపోహలు వద్దని యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
క్షేత్ర స్థాయిలో వాక్సిన్ వేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ, డీటీ వేణు, సర్పంచులు సాయిసుధ, పుట్టపాక మహేందర్, రత్నాకర్‌రెడ్డి, తదిరులు పాల్గొన్నారు.