భూపాపల్లి : జయశంకర్ భూపాలపల్లి(Tiger roaming) జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. ఇటీవల కాలంలో పెద్దపులి పశువుల దాడి చేస్తుండటంతో రైతులు భయాందోళకు గురవుతున్నారు. తాజాగా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో ఓ రైతుకు చెందన ఎద్దుపై దాడి చేసి చంపేసింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికపోతున్నారు.
అటవీ శాఖ అధికారులు పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరించారు.