కనీవినీ ఎరుగని స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది
టీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల సమస్య తీరింది
కాంట్రాక్టు ఉద్యోగుల కళ సాకారమైంది
వరంగల్ జడ్పీ చైర్ పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
ఉద్యోగాల ప్రకటనపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు
కృష్ణకాలనీ, మార్చి 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో త్వరలోనే తెలంగాణ నిరుద్యోగం లేని రాష్ట్రంగా అవతరింబోతున్నదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ బుధవారం టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీఎం చిత్రపటానికి జ్యోతి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ర్టాన్ని సాధించారన్నారు. ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలనే సంకల్పంతో ప్రపంచం గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని నిధులు ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయారని, నేడు స్వరాష్ట్రంలో ఆ నిధులను మనకే వాడుతూ తెలంగాణను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారన్నారు. దేశంలోనే తెలంగాణకు మంచి గుర్తింపుతీసుకువచ్చారన్నారు. నియమకాల్లో ఇప్పటికే రాష్ట్రంలో లక్షా38వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. 317 జీవో ప్రకారం మల్టీజోన్ ద్వారా రాష్ట్రంలో ఖాళీలన్నింటిలో ఉద్యోగులను నియమించారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండొద్దని 91,142 పోస్టులకు ఉద్యోగ ప్రకటన చేశారంటే సీఎం కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కొన్నేండ్లుగా పని చేస్తున్న 11,103 కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలను తీర్చేందుకు వారందరినీ రెగ్యులరైజ్ చేస్తానని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. మన కాళేశ్వరం జోన్‌కు 1,630 ఉద్యోగాలు వస్తున్నాయని, తద్వారా జిల్లాలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాల ప్రకటపై బీజేపీ నాయకులు నీతిలేని మాటలు మాట్లాడుతున్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో లెక్కలతో సహా చెప్తామని, కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, భూపాలపల్లి ఎంపీపీ మందల లావణ్యా విద్యాసాగర్ రెడ్డి, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, ప్రధాన కార్యదర్శి బీబీచారి, అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, ప్రధాన కార్యదర్శి పోలవేణి మహేందర్, ఎస్సీ సెల్ అర్బన్ అధ్యక్షుడు మోకిడి అశోక్, ఎస్సీ సెల్ కోశాధికారి గోగుల మధన్మోహన్, పార్టీ అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కౌన్సిలర్లు, నాయకులు బుర్ర రమేశ్, కరీం, మేనం తిరుపతి, బుర్ర సదానందం, చాట్ల రాములు యాదవ్, పైడిపెల్లి రమేశ్, తాటి అశోక్ గౌడ్, బాబర్ పాషా, బండారి రవి, మేనం రాజేందర్, బట్టు సంపత్, కోడెపాక సంజీవయ్య, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డి, రామయ్య, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, యూత్ నాయకులు సింగనవేణి చిరంజీవి యాదవ్, శ్రీకాంత్ పటేల్, యుగేంద్రచారి, వంశీ, మాదాసు రాజశేఖర్, రాపాల రాకేశ్, సిద్ధం రాకేశ్, సామల హరీశ్, గోవర్దన్, కో ఆప్షన్ మెంబర్లు వజ్రమణి, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.