చిట్యాల మార్చి 06 : జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల పరిధిలో జరుగుతున్న ఓ బాల్యవివాహాన్ని పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం చైల్డ్‌లైన్ కమిటీ వద్దకు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. అబ్బాయిలు, అమ్మాయిలకు పెళ్లి వయస్సు రాకుండా బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. బాలికలను తల్లిదండ్రులు బాగా చదివించాలన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆడపిల్లలు భారంగా అనుకోకుండా బాగా చదవించాలని ఆయన సూచించారు. ఎక్కడైనా బాల్య వివహాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ లింగన్న, నాగరాజు పాల్గొన్నారు.