జయశంకర్ భూపాలపల్లి: మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని దుబ్బగూడానికి చెందిన అఫ్రీన్ ( 35) భర్త పేరు అంజద్ కూలి పని చేసుకొని నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో సోమవారం సాయంత్రం అఫ్రీన్ తన చీరతో దూలంకు ఉరివేసుకోగా పక్కన ఉన్న ఒక చిన్న అమ్మాయి చూసి 100 నెంబర్ కు డయల్ చేసింది.
100 నెంబర్ కు ఫోన్ రావడంతో అప్రమత్తమైన ఎస్ఐ రాజకుమార్ తన సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి పంపించారు. అక్కడకు చేరుకున్న అధికారుల బృందం.. మహిళను ఉరి నుంచి తప్పించి, 108 వాహనంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమయానికి పోలీసులు చేరడంతో ఆమె ప్రాణాలను రక్షింపబడ్డాయని స్థానికులు అంటున్నారు.