కుభీర్, అక్టోబర్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఓ వివాహిత అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. న్యూ సాంవ్లీ గ్రామానికి చెందిన మలుపు సుశీల (27) అనే వివాహిత మరణంపై ఆమె కుటుంబికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశీల మృతికి భర్త, అత్తామామలే కారణమంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూ సాంవ్లీ గ్రామానికి చెందిన మలుపు సుశీల తమ ఇంటి ముందున్న షెడ్లో విగతజీవిగా ఉండడం కుటుంబికులు గమనించారు. అనుమానాస్పద రీతిలో ఆమె మరణించడం పట్ల ఆందోళనకు దిగిన కుటుంబికులు పోలీసులకు సమాచారం అందించారు. సుశీల మరణానికి భర్త, అత్తామామలే కారణమని వారు ఫిర్యాదు చేశారు. కుబీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుశీల భర్త, అత్తామమామ తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవారని.. ఆమె మృతికి వారు ముగ్గురు బాధులని మృతురాలి తల్లి మాలేపు సంధ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి వివరించారు.