భద్రాద్రి కొత్తగూడెం. అక్టోబర్ 06 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెలీ ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ తాతామధు అధ్యక్షతన కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను అసహించుకుంటున్నారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఇక బీఆర్ఎస్దే అధికారం అన్నారు. పట్టభద్రులు అంతా తమవైపే ఉన్నారన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ ని సీఎం చేయాలని ప్రతి ఒక్కరు పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొవాలన్నారు. భారీ మెజారిటీతో తమ అభ్యర్ది రాకేశ్‌రెడ్డి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ నియోజకవర్గం నుండి ఇన్చార్జిలు భాద్యతగా ఓటర్ల నమోదు చేసి రాష్ట్ర కమిటీకి తెలియజేయాలన్నారు. పదవీ విరమణ చేసిన వారివద్ద నుండి కూడా మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు ఇంత వరకు ఇవ్వలేదన్నారు.
చావుబతుకుల్లో ఉన్న వారిని కూడా వదలడం లేదన్నారు. ఇంతటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియా నాయక్, గ్రంధాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎమ్మెల్సీ అభ్యర్ది రాకేష్ రెడ్డి, అశ్వారావుపేట ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, కార్పొరేటర్లు సింధు తపస్వి, గుణచరిత్, మల్హోత్రా సాగర్, మధుచంద్,వగ్గెల పూజిత, చాడా వెంకటరెడ్డి, గిరి బాబు, బాదావత్ శాంతి, మంజుల, సోనా పాల్గొన్నారు.