హత్యకు గురైన మహిళ ఏడేండ్లకు ప్రత్యక్షం
చనిపోయిందనుకున్న మహిళ ఏడేండ్ల తర్వాత ప్రత్యక్షమైంది.. ఆమెను హత్య చేశాడనే ఆరోపణలతో ఓ అమాయకుడు రెండున్నరేండ్లు జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ ఉదంతం కర్ణాటకలో సంచలనంగా మారింది.
- హత్యారోపణలతో అమాయకునికి రెండున్నరేండ్ల జైలు శిక్ష
- బయటపడిన కర్ణాటక పోలీసుల వైఫల్యం.. దర్యాప్తుపై విమర్శలు
మండ్య: చనిపోయిందనుకున్న మహిళ ఏడేండ్ల తర్వాత ప్రత్యక్షమైంది.. ఆమెను హత్య చేశాడనే ఆరోపణలతో ఓ అమాయకుడు రెండున్నరేండ్లు జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ ఉదంతం కర్ణాటకలో సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులోని లోపాలు చర్చనీయాంశంగా మారాయి. మండ్య జిల్లాకు చెందిన మంజుకు 2019లో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెండ్లి చేయడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో రాజేశ్ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేసి, తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు వెళుతున్నట్లు తెలిపింది.
చివరి ఫోన్ కాల్ రాజేశ్ నంబర్ నుంచి రావడంతో అతడిపై పోలీసులకు అనుమానం ఏర్పడింది. 2021 ఆగస్టులో రాజేశ్‌పై హత్య కేసు నమోదైంది. మంజును చంపి కావేరీ నదిలో మృతదేహాన్ని పడేశాడని ఆరోపణలొచ్చాయి. నాటి ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కేవలం సాక్షుల వాంగ్మూలాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో రాజేశ్ రెండున్నరేండ్ల పాటు జైల్లో ఉండి, బెయిల్‌పై బయటకొచ్చాడు. రాజేశ్ తరపు న్యాయవాదులు నాగమంగళ ప్రాంతంలో భర్తతో కలిసి ఉంటున్న మంజును గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

