Cattle Feed | రాష్ట్ర ప్రభుత్వం నిరక్ష్యం కారణంగా సాగునీరందకపోవడంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగు చేసిన వరి పంట పశువులకు మేతగా మారిపోయింది. అన్నదాత కష్టాలెలా ఉన్నాయో కండ్లకు కట్టినట్టు చూపించే ఈ ఘటన జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
ఎంతో కష్టపడి సాగు చేసిన వరికి ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో చేసేదేమి లేక రేగొండ మండల కేంద్రానికి చెందిన బిల్లా కనికి రెడ్డి అనే రైతు తన పొలంలో సాగు చేసిన తన రెండెకరాల వరిని పశువులతో మేపుతున్నాడు.
38 కాల్వ ద్వారా సాగునీరు సరఫరా అవుతుందనే కోటి ఆశలతో లక్ష రూపాయల ఖర్చు చేసి వరి సాగు చేశాడు వరి సాగు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ సాగునీరు రాకపోవడంతో బావిలో భూగర్భ జలం అడుగంటి వరి పంట ఎండిపోవడంతో దిక్కుతోచక శనివారం వరి పంటను పశువులను మేపి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై దుమ్మెత్తి పోశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం.. రైతుల ఉసులు తీస్తుందని శాపానార్ధాలు పెడుతూ కన్నీరు మున్నీరయ్యాడు.. వరి సాగుదారా రెండు లక్షలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి మరి రైతుకు రావద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు రైతు కనికి రెడ్డి.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు