వరంగల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వరంగల్, హనుమకొండ జిల్లా ల పర్యటనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నా యి. గ్రేటర్ వరంగల్‌తోపాటు వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ ఈనెల 20న మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించా యి. కేటీఆర్ పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయ ర్ గుండు సుధారాణి, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, వరంగల్ కలెక్టర్ గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా పీవో అజిత్‌రెడ్డితో సమావేశం నిర్వహించారు.
మంత్రి పర్యటనలో ప్రారంభించే, శంకుస్థాపనలు చేసే కార్యక్రమాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వరంగల్ మహానగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
తాత్కాలికంగా ఖరారు చేసిన ప్రకారం… వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి మంత్రి కేటీఆర్ పర్యటన మొదలుకానుంది. నర్సంపేటలో పైపు లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్, మెప్మా భవనం ప్రారంభోత్సవాలు చేస్తారు. దుగ్గొండి, చెన్నారావుపేట మండల మహిళా సమాఖ్యల భవనాల నిర్మాణానికి నర్సంపేటలోనే శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తారు. అనంతరం కాకతీయ వైద్య కళాశాలకు చేరుకుని గ్రేటర్ వరంగల్‌లో పర్యటన మొదలుపెడతారు. జీడబ్లూఎంసీ ప్రధా న కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆధునీకరించిన పబ్లిక్ గార్డెన్‌ను, స్మార్ట్ లైబ్రరీని, రెండు స్మార్ట్ రోడ్లను ప్రారంభిస్తారు. అ నంతరం జీడబ్లూఎంసీ, కుడా పై సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి పర్యటనలోని కార్యక్రమాలపై ఈ నెల 19న పూర్తి స్థాయి స్పష్టత రానుందని తెలిపారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యట న సందర్భంగా పార్టీ పరంగా కీలక కార్యక్రమం ఉం టున్నది. వరంగల్, హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. ఎల్బీ కాలే జీ గ్రౌండ్లో ఈ సమావేశం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు, సమీక్ష అనంతరం సాయం త్రం నాలుగు గంటలకు టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరుగనుంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 20వేల మంది ఈ సమావేశానికి హాజరవుతారనే అంచనాకు అనుగుణంగా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి, టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ ఆధ్వర్యంలో ఎల్బీ కళాశాలలో సమావేశం ఏర్పాట్ల పర్యవేక్షణ జరుగుతున్నది.