చిట్యాల : తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను(KCR birthday) జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. పటాకులు కాల్చుతూ జై బీఆర్ఎస్ , జై కేసీఆర్, అంటూ నినదించారు. అనంత మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడారు..రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించారని తెలిపారు. తెలంగాణలో అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. నిండు నూరేళ్లు చల్లగా, ఆయురోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు తౌటమ్ నవీన్, సీనియర్ నాయకులు పిట్ట సురేష్, కొత్తూరి రాజిరెడ్డి, కాట్రేవుల కుమార్, పాండ్రాల వీరస్వామి, పెరుమాండ్ల రవీందర్, నునావత్ శ్రీను నాయక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.