కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటేత్తారు.హైదరాబద్,వరంగల్,భూపాలపల్లి, కరీంనగర్ నుంచే గాక వివిధ జిల్లాల భక్తులు, మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ భక్తులు వచ్చారు. ఈసందర్భంగా త్రీవేణి సంగమం గోదావరి తీరంలో భక్తులు స్నానలు చేసి మహిళలు ప్రత్యేక దీపాలు వదిలి,సైకత లింగాలకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయం లో కాళేశ్వర, ముక్తిశ్వర స్వామి వారికి వివిధ ప్రాంతల నుంచి వచ్చన భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శుభనంద దేవి (పారతి అమ్మవారు)ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతలనుంచి వచ్చిన భక్తులు తులసీ చేట్టుకు పూజలు చేసీ, దీపాలు వెలిగించారు.