మంత్రి కొప్పుల ఈశ్వర్..
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
42, 33వ డివిజన్లలో ప్రచారం
కరీమాబాద్, ఏప్రిల్ 26 : టీఆర్ఎస్తోనే అభివృద్ది సాధ్యమని, పార్టీకి ప్రజలు అండగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం 42వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కేడల పద్మ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి, కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి ఆరేండ్లలో చేసి, చూపించామన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి కేడల పద్మను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిని కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, మానుకోట జడ్పీ చైర్పర్సన్ బిందు, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ పాల్గొన్నారు.
33వ డివిజన్లో..
టీఆర్ఎస్ గ్రేటర్ 33వ డివిజన్ అభ్యర్థి ముష్కమల్ల అరుణ ఆధ్వర్యంలో కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, ముష్కమల్ల సుధాకర్, జబ్బార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి..కొడుకుకు తీవ్రగాయాలు