Ishan Kishan : ప్రపంచకప్‌లో చెలరేగిపోతున్న ఆడుతున్న భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) పాకిస్థాన్‌పై రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ(0) తొలి ఓవర్లోనే ఔట్ కావడంతో శుభారంభమిచ్చే బాధ్యత తీసుకున్న ఇషాన్.. బౌండరీలతో శివాలెత్తిపోయాడు. దాయాదుల పోరులో మూడో వేగవంతమైన అర్ధ శతకం సాధించాడీ లెఫ్ట్ హ్యాండర్. అబ్రార్ అహ్మద్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన ఇషాన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సీనియర్ షాహీన్ అఫ్రిదికి 6, 4 తో స్వాగతం పలికిన ఈ చిచ్చరపిడుగు.. ఆయూబ్ వేసిన ఆరో ఓవర్లో ఈ డాషింగ్ బ్యాటర్ రెండు ఫోర్లతో స్కోర్ 50 దాటించాడు. 42 పరుగులతో ఉన్న అతడు.. పవర్ ప్లే అనంతరం అబ్రార్ అహ్మద్‌కు చుక్కలు చూపిస్తూ హ్యాట్రిక్ ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు.
Half-Century in no time! 👊
Ishan Kishan brings up his 5️⃣0️⃣ off just 27 balls!
Updates ▶️ https://t.co/IgYYH0TeR9 #TeamIndia | #T20WorldCup | #MenInBlue pic.twitter.com/0MJztCv81J
— BCCI (@BCCI) February 15, 2026
భారత్ – పాక్ మ్యాచ్‌లో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇషాన్దే. మొహమ్మద్ హఫీజ్(23 బంతుల్లో) అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ(24 బంతుల్లో) రెండులో కొనసాగుతున్నాడు. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 29 బంతుల్లో అర్ధ శతకంతో నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు.