చిట్యాల:పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎంపీపీ దావు వినోదా, జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు వరికోల్‌పల్లి గ్రామానికి చెందిన చెల్పూరు సత్యం(రూ.10వేలు), చల్లగరిగలో ఇంజపెల్లి విద్యాసాగర్(రూ.40వేలు), తిరుమలపూర్ గ్రామానికి చెందిన గోల్కొండ శ్రీనివాస్(రూ.73వేల), గోనె రవి(రూ.40వేల) విలువగల చెక్కులను సోమవారం స్వయంగా ఇంటికి వెళ్ళి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేద ప్రజలు ప్రైవేట్ అసుపత్రుల్లో చికిత్స పొంది మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, ఆయా గ్రామాల సర్పంచులు పెండెం సాంబమూర్తి, కర్రె మంజూల అశోక్‌రెడ్డి, హమీనాభేగంషంషోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.