గణపురం : బాల్య వివాహలతో బాలల మెడకు ఉరితాడు బిగించొద్దని గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ అన్నారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామితో కలిసి వివాహాన్ని ఆపేశారు. ఈ సందర్బంగా ఎస్సై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లోఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, ఆడపిల్లలు ఇంటికి భారమనే అపోహల వల్ల బాల్య వివాహాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. బాలికలకు మెరుగైన విద్యావకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరుచుకోవాలని ఎస్సై పేర్కొన్నారు.
గ్రామాలల్లో ఎవరైనా బాల్య వివాహాలు చేసినా, బాల కార్మికులను ప్రోత్సహించినా, పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు గానీ 100కు గానీ సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ సోషల్ వర్కర్లు లింగారావు, శైలజ, చైల్డ్ లైన్ టీం మెంబర్లు సాయి, రాంచరణ్, సర్సంచ్ పోతుల ఆగమ్మ, కార్యదర్శి షఫీ, అంగన్వాడీ టీచర్ ప్రసన్న, పోలిస్ సిబ్బంది సతీష్, రతన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.