మహాదేవపూర్: ఎస్సీ వర్గీకరణ(SC classification) తర్వాతే నియమాకాలు చేపట్టాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు అమీన్ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ చేస్తున్న నిరాహార దీక్షల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో 59 కులాలకు సమన్యాయం జరిగే వరకు నియామకాలు ఆపి వర్గీకరణను సంపూర్ణంగా అమలుపరిచే వరకు నియామకాలు చేపట్టొద్దన్నారు. మాదిగలకు వర్గీకరణ ఫలితాలు దక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. మాలలకు తలొగ్గి ప్రభుత్వం వారు చెప్పినట్లు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ, ముస్లిం హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ముజ్జు, మండల ఉపాధ్యక్షులు అహ్మద్, మండల కోశాధికారి ఖమర్ పాషా, మాదిగ యువసేన మండల అధ్యక్షుడు మంతెన రవితేజ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు వేమునూరి జక్కయ్య, చకినారపు చందు, కన్నూరి గట్టయ్య, బెల్లంపల్లి మల్లేష్, మోతే సమ్మయ్య, నేరెళ్ల జయకర్, లింగాల ప్రభు కుమార్, తదితరులు పాల్గొన్నారు.