జయశంకర్ భూపాలపల్లి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలను చక్రవర్తులను చేసిన మహనీయుడు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా లు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వ అధికారులు తమ వృత్తి ధర్మంలో భాగంగా మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించి ఒక్కో ఇంటికి రూ. 10 లక్షలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
రూ. కోటితో సంవత్సరంలోగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గo వెంకట రాణి. వైస్ చైర్మన్ కొత్త హరిబాబు. ఎస్సీ ,ఎస్టీ ,బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.