భూపాలపల్లిటౌన్, డిసెంబర్14 : మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో కంటికి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టింది. మూడేండ్ల క్రితం ఉద్యమంలా నిర్వహించిన కంటి వెలుగు విజయవంతం కావడంతో మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించి, అద్దాలను అందించారు.
రెండో విడుతకు సన్నద్ధం
జనవరి 18వ తేదీ నుంచి చేపట్టబోయే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాం ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో బాధితుల వివరాలు తెలుసుకునేందుకు 12 రోజుల పాటు ఆశ కార్యకర్తలతో ఇంటింటా సర్వే చేయించారు. ఇందు కోసం జిల్లాలో 25 బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,52,142 మందికి (18 ఏళ్లు పైబడిన వారికి) ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరనుంది.
ఆరోగ్య తెలంగాణ దిశగా ..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైద్య రంగానికి అధిక ప్రాధా న్యతనిస్తున్నారు. సర్కారు వైద్యాన్ని బలోపేతం చేస్తూ పేదలకు మరింత చేరువ చేస్తున్నారు. ఈ క్రమంలో మొద టి విడుత కంటి వెలుగులో ఖరీదైన మొబైల్ రిఫ్రాక్టర్ పరి కరాలను ఉపయోగించి పరీక్షలు చేశారు. అలాగే కార్పొరేట్ దవాఖానల్లో ఆపరేషన్లు చేయించడంతో పాటు నాణ్యమైన అద్దాలు పంపిణీ చేశారు. అదేవిధానాన్ని రెండో విడుత లోనూ చేపట్టి ప్రజల కంటి సమస్యను దూరం చేయనున్నారు.
తొలి విడుతలో 2,22,603 మందికి
తొలి విడుత కంటి వెలుగు కార్యక్రమం నిర్వ హించగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 167 గ్రామాల్లో 2,22,603 మందికి పరీక్షలు నిర్వ హించారు. మొత్తం 9 బృందాలను ఏర్పాటు చేశా రు. 48,190 మందికి కంటి అద్దాలు అంద జేశారు. కంటి సమస్యలున్న 340 మందికి ఆప రేషన్లు చేయించారు.
సర్వే ఆధారంగా పరీక్షలు
రెండో విడుత కంటి వెలుగులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎంత మంది కంటి సమస్యతో బాధ పడుతున్నారో తెలుసుకునేందుకు ఆశ వర్కర్లతో ఇంటింటా సర్వే చేయిస్తున్నాం. సర్వే రిపోర్టు ఆధారంగా జనవరి 18 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగులో వైద్య పరీక్షలు చేయిస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 25 టీంలను ఏర్పాటు చేశాం. 2,52,142 మందికి పరీక్షలు చేయించాలని నిర్ణయించుకున్నాం.
డాక్టర్ శ్రీరాం, డీఎంహెచ్వో