Allu Shirish Haldi Event | మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలవ్వగా, తాజాగా జరిగిన శిరీష్ హల్దీ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన తమ్ముడి జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టానికి అన్న అల్లు అర్జున్ హాజరుకాలేకపోయాడు. ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్ పనుల్లో దేశం వెలుపల బిజీగా ఉండటం వల్లే బన్నీ ఈ వేడుకకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తమ్ముడి హల్దీ ఫోటోను పోస్ట్ చేస్తూ.. “ఐ మిస్డ్ బీయింగ్ హియర్” (నేను అక్కడ ఉండాల్సింది, కానీ మిస్ అయ్యాను) అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు. శిరీష్ తన చిరకాల స్నేహితురాలు నయనికాను వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ జంటకు బన్నీ తన ప్రేమపూర్వక ఆశీస్సులు అందజేశారు. బన్నీ లేకపోయినా ఆయన భార్య స్నేహ రెడ్డి, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. హల్దీ వేడుకను మిస్ అయినప్పటికీ, త్వరలో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్‌కు మాత్రం అల్లు అర్జున్ తప్పకుండా హాజరవుతారని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.
#RagalahariNews – అల్లు వారి ఇంట “పసుపు” ఫంక్షన్‌తో ప్రారంభమైన అల్లు శిరీష్ – నయనికాల పెళ్లి వేడుక#AlluSirish @AlluSirish #Nayanika #AlluFamily #AlluArjun pic.twitter.com/gnEeHoKo2c
— Ragalahari (@Ragalahariteam) February 13, 2026