కొమురం భీం ఆసిఫాబాద్ : పట్టణ మున్సిపాలిటీలో ( Asifabad Muncipality ) అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు 4గురు గెలుపొందారు. మున్సిపాలిటీని దక్కించుకోవడంలో ఇండిపెండెండ్లు కీలకం కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 2, 3, 7, 9, 17, 19, 4, 6, 16, 20వ వార్డులో గెలుపొందారు. 5, 11, 13, 15, 8, 12, 14వ వార్డులో కాంగ్రెస్, 1,2, 10,18 వ వార్డులో ఇండిపెండెంట్లు విజయం సాధించారు.