Iron Tablets: అధిక డోసులో ఐరన్ ట్యాబ్లెట్లు.. 19 మంది స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
Iron Tablets: చంద్రాపూర్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ స్కూల్ లో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధిక డోసులో ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు.
చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ స్కూల్ లో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధిక డోసులో ఐరన్ ట్యాబ్లెట్లు(Iron Tablets) తీసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. ఆ విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించారు. భద్రతావతి తహిసిల్‌లోని భండేలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల అస్వస్థతపై దర్యాప్తు చేపట్టారు.
ప్రతి సోమవారం స్కూల్ విద్యార్థులకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. అయితే మంగళవారం రోజున కూడా కొందరు స్కూల్ స్టూడెంట్స్ మరిన్ని ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. టీచర్లు లేని సమయంలో స్టూడెంట్స్ ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నారు. డోసు ఎక్కువ కావడంతో బుధవారం రాత్రి ఆ విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు.
అంబులెన్సులను రప్పించిన స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను చంద్రాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల ప్రకారం 16 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నది. మరో ముగ్గురు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఈ ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణకు జిల్లా పరిషత్ సీఈవో ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

