వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలి
గోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందొద్దు
మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, ఏటూరునాగరంలో అధికారులతో సమీక్ష
మహబూబాబాద్, జూలై 23 : భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభిలాషా అభినవ్ అధ్యక్షతన అధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. చెరువులు, కుంటలు, రహదారులపై వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని మొత్తం 737 చెరువుల పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల కట్టలు తెగిపోకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటికే కట్ట పైనుంచి పొంగిపొర్లుతున్న దంతాలపల్లి మండలం పెద్దముప్పారం చెరువు, మరిపెడ మండలం యల్లంపేట పెద్ద చెరువు, కేసముద్రం మండలం వెంకటగిరి పెద్ద చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా సంబంధిత అధికారులు చూడాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ మీటర్లు లేనివారికి ఉచితంగా అందించేందుకు ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ రూ. 5 లక్షలు అందించడం అభినందనీయమన్నారు.
బ్రిడ్జిల నిర్మాణం వేగంగా చేయాలి..
రహదారులపై అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మా ణం వేగవంతం చేయాలన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆర్అండ్బీ, పీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 50 శాతం అధికంగా వర్షాలు కురిశాయని మంత్రి అన్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, జలపాతాల వద్ద యువకులు సెల్ఫీల సరదాతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. జిల్లాలోని భీమునిపాదం, ఏడుబావుల, చింతోనిగుంపు జలపాతాల వద్ద అధికారులు ప్రమాదాలు జరుగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
నేడు 1.5 లక్షల మొక్కలు నాటుతాం..
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ, టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం జిల్లాలో 1.5 లక్షల మొక్కలు నాటుతామని మంత్రి సత్యవతి అన్నారు. ముక్కోటి వృక్షార్చనలో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పాల్గొని ఇంటిలో మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 69 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటికే 54 శాతం నాటామని డీఎఫ్‌వో రవికిరణ్ అన్నారు. బయ్యారం అటవీ ప్రాంతంలోని గుట్టల్లో సీడ్‌బాల్స్ చల్లేందుకు చర్యలు చేపట్టామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై, చెరువులు, కుంటల వద్ద ప్రమాదాలు జరుగకుండా చూడాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
వరద తగ్గిన తర్వాత
గోదావరి కరకట్ట నిర్మాణం..
ఏటూరునాగారం : వరదల నుంచి ప్రజలను కాపాడుతామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిపై ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. వరదలు తగ్గిన తర్వాత గోదావరి కరకట్ట ని ర్మిస్తామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రతి గ్రామంలో అధికారిని నియమించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని కోరారు. రామప్ప చెరువు నిండితే రోడ్లపైకి వరద వచ్చే అవకాశం ఉందని, వెంటనే ఈఈ స్థాయి అధికారిని ఇక్కడ నియమించాలన్నారు. రామప్పకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మేడారం జాతర నిర్వహణపై త్వరలోనే సమీక్ష జరుపనున్నట్లు, ఇందుకు సంబంధించిన ప్రణాళికను కలెక్టర్ రూపొందించారన్నారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి, ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగే, ఎస్పీ సంగ్రాం సింగ్జీ పాటిల్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షు డు పల్లా బుచ్చయ్య, నీటి పారుదలశాఖ సీఈ విజయ భాస్కర్‌రావు, ఏఎస్పీ గౌస్ ఆలం, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు వెంకటకృష్ణారావు, జగదీశ్వర్, డీఈఈలు సదయ్య, అరవింద్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్, డీఈఈ రఘువీర్, పంచాయతీ రాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ రవీందర్, డీపీ వో వెంకయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు వలియా బీ, ఎంపీపీ విజయ, గిరిజన సంక్షేమశాఖ ఈఈ హేమలత, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో ఫణిచంద్ర, సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఆ త్మ చైర్మన్ దుర్గం రమణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సునీల్‌కుమార్, తుమ్మ మల్లారెడ్డి, కూ నూరు మహేశ్, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశో క్, ఎంపీటీసీ అల్లి సుమలత పాల్గొన్నారు.
గోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందొద్దు..
మంగపేట : గోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె మంగపేట పుష్కరఘాట్ సమీపంలో కోతకు గురవుతున్న గోదావరి తీరాన్ని జడ్పీ చైర్మన్ జగదీశ్వర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తీర ప్రాంత సమస్యను ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. వరదలు తగ్గు ముఖం పట్టాక, టెండర్లు పిలిచి గోదావరి తీరానికి రివిట్మెంట్ చేపట్టనున్నట్లు వివరించారు. ముంపు ప్రాంతాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించి, అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, పీవో హన్మంతు కే జండగే, ఏఎస్పీ గౌస్ ఆలం, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు బుచ్చయ్య, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో ఇక్బాల్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి వీరునాయక్ ఉన్నారు.