మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వానా షమీమ్
వరంగల్, ఆగస్టు 7 : చారిత్రక ఓరుగల్లు నగరానికి ప్రపంచ గుర్తింపు వచ్చేలా శ్రమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌కు అవకాశమిచ్చారని అన్నా రు. కేసీఆర్‌కు వరంగల్‌పై ప్రత్యేకమైన ప్రేమ ఉందని, ఆయన ఆలోచనల మేరకు నగరాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం ఇచ్చారని, నగరాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మాట్లాడుతూ.. చారిత్రక వరంగల్ నగరానికి డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడానికి సహకరించిన మం త్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నరేందర్, ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌కు రుణపడి ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పని చేస్తూ నగరాభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు.
డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వానా షమీమ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేసిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమెను సీట్లో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నరేందర్, ధర్మారెడ్డి, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ముస్లిం మత పెద్ద ఖుస్రుపాషా, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిప్యూటీ మేయర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.