ఏటూరునాగారం మాస్టర్‌ప్లాన్‌ను సీఎం దృష్టికి తీసుకుపోతాం
మంత్రి సత్యవతి రాథోడ్
ఏటూరునాగారంలో పల్లె నిద్ర
ఏటూరునాగారం, జూలై 2 : పల్లె ప్రగతిలో ప్రజల భా గస్వామ్యం పెంచాలని, చేస్తున్న పనులను ప్రతి గ్రామ సభలో తెలియచేస్తే ప్రజల్లో మనం పనిచేస్తున్నామనే నమ్మ కం కలుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్ర వారం రాత్రి పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఏటూరునాగారం పంచాయతీలో చేపడుతున్న పనులపై సర్పంచ్, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. కా ర్యక్రమంలో వార్డు సభ్యులు, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శి రఫీ, ఎంపీడీవో ఫణిచంద్ర గ్రామం లో చేస్తున్న పనుల వివరాలు, సమస్యలు విన్నవించారు. వార్డు సభ్యులు రంజిత్, సుజాత మాట్లాడుతూ విద్యుత్ వైర్లు, డ్రైనే జీ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ వైపు డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, వై జంక్షన్ నుంచి బస్టాండు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ కోరారు. గ్రామంలోని వర్షం నీరు బయటకు పోవడానికి సరైన మార్గం లేదని, ఎస్సీ కాలనీలో పెద్ద ఎత్తున నీరు నిలిచి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నట్లు జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ తెలిపారు. జడ్పీ చై ర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలోనే ఏటూరునాగారం అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ఎస్ఈ ద్వారా మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామం లో చేపట్టే పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ప్రతి ఇంటి నుంచి చె త్త సేకరించాలని సూచించారు. ఇంటింటా పంపిణీ చేసే మొక్కలు వారికి ఉపయోపడేలా ఉండాలన్నారు. ప్రతి ఇం టికి మిషన్ భగీరథ నీరు, మరుగుదొడ్లు ఉండాలన్నారు..
పంచాయతీకి ట్రాక్టర్, రూ.10 లక్షలు మంజూరు
డ్రైనేజీ నిర్మాణం కోసం తన నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంకా అవసరమైతే కలెక్టర్ ద్వారా ఇప్పిస్తామన్నారు. చెత్త సేకరణ కు ట్రాక్టర్ కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ యువతకు ట్రాలీ ఆటోలు మంజూరు చేసి వాటిని గ్రామ పంచాయతీకి ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్డు, శ్మశాన వాటిక అవసరమని ఎంపీడీవో తెలుపగా ఈజీఎస్ ద్వారా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఏటూరునాగారం మాస్టర్ ప్లాన్ నివేదిక ను తనకు అందిస్తే ఎన్ని నిధులు అవసరం ఉంటాయో తెలుసుకోవడంతో పాటు అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పా రు. గ్రామంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి? వారంతా ఏంచేస్తున్నారు? ఇందులో చదువు కున్న వారు ఎంతమంది, ఉద్యోగాలు ఎంత మంది చేస్తున్నారనే వివరాలు కూడా సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామంలో 16 మంది మాత్రమే పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఉన్నారని, మరి కొంత మంది అవసరం ఉన్నట్లు ఎంపీడీవో ఫణిచంద్ర చెప్పారు. కాగా, అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి అనుమతి ఇస్తూ అవసరాన్ని బట్టి ఐదు నుంచి పది మందిని నియమించుకో వాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగే, రైతు బంధు సమతి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఎంపీపీ అంతటి విజయ, ఆత్మ చైర్మన్ దుర్గ రమణయ్య, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కాగా, పల్లె ప్రగతిలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఏటూరునాగారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో పల్లె నిద్ర చేశారు.
ముస్లిం సేవా సమితి సేవలు మరువలేనివి
కృష్ణకాలనీ : ముస్లిం సేవా సమితి సభ్యుల సేవలు మరువలేనివని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన వారికి, కరోనా బాధితులకు రెండు నెలలుగా సభ్యులు చేస్తున్న సేవలను గుర్తించి, ఎమ్మెల్యే గండ్ర, మంత్రి సత్యవతి శుక్రవారం జిల్లా కేంద్రంలో వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ కరీం, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత, భూపాలపల్లి టౌన్ అధ్యక్షుడు ఎండీ బాబుమియా, జిల్లా నాయకుడు బుర్ర రమేశ్, ముస్లిం సేవా సమితి సభ్యులు సాధిక్‌పాషా, రుక్నుద్దీన్, జుబేర్, ఆరిఫాసాధిక్, అస్లాం, అజీమ్, చాంద్‌పాషా, అక్బర్, షబ్బీర్, జమీర్, అఫ్రీద్, బాబర్ పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న మంత్రి
తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారమ్మలను శుక్రవా రం ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండలకేంద్రంలోని పల్లె ప్రకృతివనంలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆమె వెంట ఎంపీపీ గొంది వాణిశ్రీ, సర్పంచులు బాబు రావు, సునీల్, శ్రీధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీ చంద్రయ్య తదితరులు ఉన్నారు.