జనగామ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలం కూనూరు గ్రామంలో బీజేపీ గుండాలు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన ఘటన గాయపడ్డ కార్యకర్తలను ఆయన స్థానిక ఎమ్మెల్యే టి. రాజయ్యతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా సంపత్‌రెడ్డి మాట్లాడుతూ..బండి సంజయ్ యాత్ర పేరుతో కూనూర్ గ్రామానికి 500 మంది గూండాలను తీసుకొచ్చి కర్రలు, రాడ్స్, రాళ్ల తో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనతో బీజేపీ వైఖరి మరోసారి బయట పడిందన్నారు. ఈ ఘటన పై విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు.