రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ నెల 20న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో రెండు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాట్లపై ఆయన సమీక్షించి టూర్ వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో 9.15గంటలకు చేరుకొని జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో రూ.27.63 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప్రారంభోత్సవాలు, రూ.150.20కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు. మధ్యాహ్నం రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష అనంతరం కుడా మైదానంలో కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ ఎంట్రెన్స్ ఆర్చ్‌ను ప్రారంభించి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారని వివరించారు.
హనుమకొండ, ఏప్రిల్ 18 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మంత్రి సందర్భంగా చేయనున్న శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభం, ఏర్పాట్లపై హనుమకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ట్లు తెలిపారు. ఉదయం 8.30గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి ఉ దయం 9.15గంటలకు చేరుకుంటారని చెప్పారు.
అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారన్నా రు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగ తి, సీఎంఏ, మున్సిపల్ సాధారణ నిధులు, స్మార్ట్‌సిటీ, స్టేట్ గ్రాంట్ ఫండ్ కింద రూ. 27.63కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, అలాగే రూ.150.20కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని వివరించారు. రూ.7కోట్ల వ్యయంతో భద్రకాళి దేవాలయం కమాన్ నుంచి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన ఆర్4 రోడ్డు, రూ.7కోట్లతో అలంకార్ దర్గా బ్రిడ్జి నుంచి రోడ్ నంబర్ 2 వరకు నిర్మించిన స్టార్ట్రోడ్డు ఆర్ 3ను ప్రారంభిస్తారని వివరించారు.
ఇం కా రూ.11.50కోట్ల వ్యయంతో గార్డెన్లో చేసిన అభివృద్ధి పనులు, రూ.1.5కోట్లతో ఆధునీకరించిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అదేవిధంగా రూ.27లక్షలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠ రథాలు, రూ.36లక్షలతో కొ నుగోలు చేసిన 66 ఫాగింగ్ మిషన్లను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.8కోట్లతో ఏర్పాటు చేయనున్న 150కేఎల్డీ, ఎఫ్ఎస్పీపీ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.20.50కోట్లతో నిర్మించనున్న జీడబ్ల్యూఎంసీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణానికి, రూ.2కోట్లతో నిర్మించనున్న కౌన్సిల్ హాల్‌కు, విద్యుత్‌నగర్‌లో రూ. 2కోట్లతో నిర్మించనున్న దివ్యాంగు ల ప్రత్యేక శిక్షణ కేంద్రం, 37 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.9కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు, రూ.1.50కోట్లతో పోతన వైకుంఠధామం అభివృద్ధి, రూ.22కోట్లతో నయీంనగర్ నుంచి ప్రిస్టన్ స్కూల్ వరకు వరద చేపట్టే రిటెయింగ్ వాల్ ని ర్మాణ పనులకు, రూ.15కోట్లతో నాలాలపై కల్వర్టు ల నిర్మాణానికి, జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో రూ.71కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కం ట్రోల్ సెంటర్ ఏర్పాటుకు, రూ. 2.50కోట్లతో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసీ రిటైనింగ్ వా ల్ నిర్మాణానికి, రూ.70లక్షల వ్యయంతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో ఏర్పాటు చేయనున్న జాతీయ జెండాకు, జీడబ్ల్యూఎంసీ ఆవరణలో రూ.4కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జీడబ్ల్యూఎంసీ వద్ద నుంచే మంత్రి శంకుస్థాపనలు చేస్తారని చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ వివరించారు. అలాగే అక్కడే డబు ల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తారన్నారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి హెలిక్యాప్టర్ ద్వారా నర్సంపేటకు వెళ్తారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేయడంతోపాటు మహిళా సంఘాలతో స మీక్ష, ఆ తర్వాత ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. తిరిగి హెలీక్యాప్టర్‌లో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చేరుకుంటారని, అక్కడి నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఇంటికి చేరుకొని భోజనం చేస్తారని, మధ్యాహ్నం 2.30గంటలకు హ నుమకొండ కలెక్టరేట్ చేరుకొని సమావేశ మందిరం లో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారని తెలిపా రు. ఆ తర్వాత స్టేషన్ ఘన్‌పుర్ ఎమ్మెల్యే రాజయ్య ఇంటి వద్ద టీ బ్రేక్ తీసుకుంటారని తెలిపారు.
అక్క డి నుంచి హనుమకొండ కుడా మైదానంలో ఏర్పా టు చేసిన వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నా రు. అనంతరం హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్తూ మధ్యలో వరంగల్ ఎంట్రెన్స్ ఆర్చ్‌ను ప్రారంభిస్తారని చీఫ్‌విప్ తెలిపారు. మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాద వ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమే శ్, సీపీ తరుణ్‌జోషి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేంద్రరావు, ఆర్డీవో వాసుచంద్ర, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, తహసీల్దార్ రాజ్‌కుమార్, విద్యుత్‌శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.