రాయపర్తి, సెప్టెంబర్ 1 : టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ జెండా పండుగకు మండలంలోని గ్రామాలు, పల్లెలు ముస్తాబు అవుతున్నాయి. 16 నూతన గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ జెండా గద్దెలను నిర్మిస్తుండగా 23 పాత గ్రామ పంచాయతీల్లోని జెండా గద్దెలకు రంగులు వేస్తున్నారు.
గీసుగొండ : టీఆర్ఎస్ జెండా పండుగకు ప్రతి కార్యకర్త హాజరుకావాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. బుధవారం అయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కొత్త కమిటీల ఏర్పాటుతో టీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు.
నర్సంపేట రూరల్ : మండలంలోని 27 గ్రామాలు, శివారు పల్లెలు, తండాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మచ్చిక రాజుగౌడ్, అల్లి రవి, నాయకులు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జెండాను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎగురవేయనున్నారు.
ఖిలావరంగల్ : ఖిలావరంగల్‌లోని 37, 38 డివిజన్లలో టీఆర్ఎస్ జెండా పండుగ సన్నాహక సమావేశం కార్పొరేటర్లు బోగి సువర్ణ, బైరబోయిన ఉమ ఆధ్వర్యంలో నిర్వహించారు. పడమర కోటలోని తెలంగాణ అమరవీరుల స్తూపంవద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ జెండాను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించనున్నారని మాజీ కార్పొరేటర్ దామోదర్‌యాదవ్ తెలిపారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు భోగి సురేశ్, టీఆర్ఎస్ నాయకులు చందర్, గిరిప్రసాద్‌నగర్ అధ్యక్షు డు ఎండీ ఉల్ఫత్, కందిమల్ల మహేశ్, సిరోబయిన వా సు, మొయిన్, ఏలియా, మంద శ్రీధర్‌రెడ్డి, కర్ణాకర్, అ న్వేశ్, విజయ్, ప్రమోద్, అలెగ్జాండర్ పాల్గొన్నారు.
కరీమాబాద్ : అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని డివిజన్లలో ఆయా కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని గులాబీ జెండా పండుగ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో రంగశాయిపేటలో టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మించి రంగులు వేయించారు. నాగేశ్వరస్వామి దేవస్థాన కమిటీ సభ్యు డు బజ్జూరి రవి, నాయకులు పాల్గొన్నారు.