వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 1 : పేదల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ వారోత్సవాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. బుధవారం పిన్నావారివీధిలోని వాసవి భవన్లో నిర్వహించిన క్లబ్ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు క్లబ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం గత సంవత్సరానికి మించిన బడ్జెట్‌తో సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల కార్యక్రమాల జాబితాను ప్రకటించారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు గుండాప్రకాశ్రావును సత్కరించారు. కార్యక్రమంలో తోట మార్కండేయ, పల్లెర్ల వీరన్న, మల్యాల వీరమల్లయ్య, మానేపల్లి సుధాకర్, చిదరాల నాగరాజు, గాదె వాసుదేవ్, తాళ్లపల్లి వాసుదేవులు, గుమ్మడవెల్లి సత్యనారాయణరావు, ఎలిశాల ఆనంద్, డాక్టర్ శరత్‌కుమార్, ప్రొఫెసర్ వెంకటనారాయణ, బెలిదె వెంకటేశ్వర్లు, సదాశివరావు, శివానందం, అమర్నాథ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.