స్టేషన్‌ఘన్‌పూర్, జూలై 8: మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి 70వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రంలోని శ్రీపద్మావతి కన్వెన్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల శ్రేణులు కేక్‌కట్ చేశారు. ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న, మాజీ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్, సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న కడియం శ్రీహరి ఎప్పడూ ప్రజల గుండెల్లో ఉంటారని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల క్యాబినెట్లో మంత్రి పదవులు చేపట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.
కడియం శ్రీహరి నీతి, నిజాయితీకి అంబాసిడర్ లాంటి వారని, ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కడియం అభిమానులు తెల్లాకుల రామకృష్ణ, కొర్ర వెంకటేశ్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ స్వామినాయక్, రైతుబంధు సమితి తాటికొండ గ్రామ కోఆర్డినేటర్ రాపోలు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు లింగారెడ్డి, సర్పంచ్‌లు పోగుల సారంగపాణి, నగరబోయిన మణెమ్మయాదగిరి, ఉద్దెమారి రాజుకుమార్, మాజీ సర్పంచ్‌లు తాళ్లపల్లి వెంకటయ్య, వంగాలపల్లి సుధాకర్ చేరాలు, సానాది రాజు, నీరటి ప్రభాకర్, పేరాల సుధాకర్, మోడం స్వామి, తాటికొండ కుమారస్వామి, ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, కోతి రాములు, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, రజాక్ యాదవ్, తాళ్లపల్లి సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ యాకయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యుడు యాకూబ్‌పాష, బూర్ల శంకర్, చిగురు విజయ్‌కుమార్, దశరథం, చిల్పూర్ మండల మాజి అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి, జీడీ ప్రసాద్, ఇప్పగూడం గ్రామ అధ్యక్షుడు పల్లె రవి, యార కొమురెల్లి, మంద రాజు, పోకల నారాయణ, గోరంటల రాజిరెడ్డి, చాడా రాజుకుమార్, కిశోర్, ఉమాశంకర్, రాములు, రత్నాకర్ రెడ్డి పాల్గొన్నారు.
శుభాకాంక్షల వెల్లువ
సుబేదారి : మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పుట్టినరోజు వేడుకలు హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కూతురు కావ్యతో కలిసి శ్రీహరి కేక్‌కట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.