
ఖానాపురం/చెన్నారావుపేట/నెక్కొండ, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ హెచ్ఎంలను ఆదేశించారు. బుధవారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలని, కొవిడ్ నిబంధనలతో విద్యాబోధన జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విధులపై నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సుమనావాణి, హెచ్ఎం రాజేందర్, కార్యదర్శి సుప్రజ ఉన్నారు. అలాగే, అదనపు కలెక్టర్ చెన్నారావుపేటలోని జడ్పీఎస్ఎస్ను సందర్శించారు. అనంతరం పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. స్కూళ్ల ఆవరణల్లో ఎక్కడా నీరు నిల్వకుండా చదును చేయించాలన్నారు. కిచెన్ షెడ్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టి శుభ్రంగా ఉంచాలన్నారు. వాటర్ ట్యాంక్‌ను బ్లీచింగ్ పౌడర్‌తో కడుగాలన్నారు. ట్యాంకులపై మూతలు ఏర్పాటు చేయాలన్నారు. టాయ్లెట్లకు డోర్లు, ట్యాప్‌లు పెట్టించాలన్నారు. ఏఎన్ఎం, మెడికల్ అధికారి ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దయాకర్, హెచ్ఎం రవి, కార్యదర్శి బాలకిషన్‌గౌడ్, టీచర్లు నిర్మల, జయశ్రీ పాల్గొన్నారు. నెక్కొండ హైస్కూల్‌ను అదనపు కలెక్టర్ హరిసింగ్, ఎంపీడీవో సాహితీమిత్ర, ఎంఈవో రత్నమాల సందర్శించారు.
పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి
రాయపర్తి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లను జడ్పీటీసీ రంగు కుమారస్వామి, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్‌తో కలిసి బుధవారం సందర్శించారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఫర్నిచర్, బోర్డులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, కరోనా నియంత్రణ చర్యలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, ఎంపీవో రామ్మోహన్, ఏపీవో కుమార్‌గౌడ్, మాజీ ఎంఈవో రంగయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం ఆయన అల్బెండజోల్ మాత్రలను కొండూరు జడ్పీఎస్‌ఎస్‌లో మండల వైద్యాధికారి వెంకటేశ్, సర్పంచ్ సరితారవీందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
స్కూళ్లలో శానిటేషన్ పనులు షురూ..
చెన్నారావుపేట/దుగ్గొండి/సంగెం: జల్లి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో శానిటేషన్ పనులను ఎంఈవో రత్నమాల, ఎంపీడీవో దయాకర్, మండలకేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్‌లో సర్పంచ్ కుండె మల్లయ్య పర్యవేక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు బుర్ర అజయ్‌కుమార్, పోలెపల్లి రవి, కార్యదర్శి బాలకిషన్‌గౌడ్, ఉపాధ్యాయులు జయశ్రీ, నిర్మలాదేవి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ స్వప్న, సీఆర్పీలు ఎం సంపత్, బాలు, ఐఆర్పీలు శ్రీనివాస్, రాజేశ్ పాల్గొన్నారు. దుగ్గొండి ఎంఈవో చదువుల సత్యనారాయణ మహ్మదాపురం, తిమ్మంపేట, నాచినపల్లి, లక్ష్మీపురం, మల్లంపల్లి, తొగర్రాయి, దుగ్గొండిలోని ఉన్నత పాఠశాలలు, మల్లంపల్లిలో కేజీబీవీని ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. తరగతి గదుల్లో 15 నుంచి 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎస్ఎంసీ చైర్మన్లు, టీచర్లు పాల్గొన్నారు. సంగెం మండలంలోని పాఠశాలల్లో జీపీల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టాయి. స్కూళ్ల ఆవరణలను సర్పంచ్‌లు ట్రాక్టర్ డోజర్లతో శుభ్రం చేయిస్తున్నారు.