చెన్నారావుపేట, ఆగస్టు 25 : మండలంలోని బోజేర్వు గ్రామానికి చెందిన పైండ్ల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు ఝాన్సీ, కుమారుడు చందన్ ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, సర్పంచ్ పిండి విజయ, గ్రామ అధ్యక్షుడు గడ్డల భిక్షపతి, ఆర్ఎంపీల సంఘం మండలాధ్యక్షుడు నార్లాపురం ఐలయ్య, సొసైటీ డైరెక్టర్ గడ్డల మల్లయ్య, జున్నూతుల మహేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ కొండవీటి ప్రదీప్‌కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన చేరాలు, రాదారపు రాజు, బోయిన రాజు, రాదారపు శ్రీనివాస్, పిండి కుమారస్వామి, పెద్దబోయిన ఎల్లయ్య, పిరాల మహేందర్ పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేటలోని 11వ వార్డుకు చెందిన కూచన భద్రయ్య భార్య పద్మ గుండెపోటుతో మృతి చెందింది. కాగా, బుధవారం ఎమ్మెల్యే పెద్ది పద్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ : మిషన్ భగీరథ ఏఈ వెంకటేశ్వర్లు ఆకస్మిక మృతికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎంపీపీ రమేశ్, జడ్పీటీసీ సరోజన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరయ్య ఉన్నారు.
దుగ్గొండి : గుండెపోటుతో మృతిచెందిన మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గోర్కటి ప్రశాంత్(45) కుటుంబాన్ని సర్పంచ్ ఇంటోళి రాజేశ్వర్‌రావు పరామర్శించారు. అలాగే ప్రశాంత్ చిన్ననాటి స్నేహితులు నూనె శ్రీధర్, పొగాకు వెంకన్న రూ.10వేల ఆర్థికసాయం అందించారు.