జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోవ్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.
చెన్నారావుపేట, ఆగస్టు 15: తహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ పూల్‌సింగ్‌చౌహాన్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బదావత్ విజేందర్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శీలం రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఖానాపురం: ఖానాపురం సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, తహసీల్దార్ కార్యాలయలో తాసిల్దార్ జూలూరి సుభాషిణి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సాయిబాబు, వ్యవసాయ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, పీహెచ్సీలో వైద్యాధికారి అరుణ్‌కుమార్, జీపీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఎగురవేశారు.
దుగ్గొండి: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కోమలాభద్రయ్య, తహసీల్‌లో నాయబ్ తాసిల్దార్ సౌజన్య, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వంగల నవీన్‌కుమార్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో దయాకర్, మండల సమాఖ్య కార్యాలయంలో సాంబలక్ష్మి, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో సత్యనారాయణ, దుగ్గొండి, కేశవాపురం పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు రాజు, స్వప్న, పశువైద్యశాలలో వైద్యాధికారులు రామ్మోహన్, శారదా, బాలాజీ, టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, జీపీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు.
నల్లబెల్లి: తహసీల్‌లో తాసిల్దార్ రోకుల ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ సతీశ్‌బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా జెండా పండుగ..
ఆత్మకూరు: తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మార్క సుమలత, పోలీస్‌స్టేషన్‌లో సీఐ రంజిత్‌కుమార్, పీహెచ్సీలో వైద్యాధికారి రణధీర్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో యాదగిరి, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ధర్మనాయక్, పీఏసీఎస్‌లో చైర్మన్ ఏరుకొండ రవీందర్‌గౌడ్, సబ్‌స్టేషన్‌లో ఏఈ రవికుమార్, స్వర్ణభారతి మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం లలితాదేవి, వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, రైతు వేదికల వద్ద రైతుబంధు కోఆర్డినేటర్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కుల సంఘాలు, ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
శాయంపేట: తహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ పోరిక హరికృష్ణ, పోలీస్‌స్టేషన్‌లో సీఐ తోగిటి రమేశ్‌కుమార్, ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, పీహెచ్సీలో వైద్యాధికారి నాగశశికాంత్, చేనేత సహకార సంఘంలో చైర్మన్ మామిడి శంకర్లింగం, జీపీలో సర్పంచ్ కందగట్ల రవి, జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీధర్, సబ్‌స్టేషన్‌లో ఏఈ రాజమౌళి, పంచాయతీ ఆఫీసుల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కొత్తగట్టుసింగారం బాలయేసు దేవాలయ ప్రాంగణంలో ఆత్మకూరు విచారణ గురువు రెవ, ఫాదర్ గోలమారి రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
నెక్కొండ: తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జీపీలో సర్పంచ్ సొంటిరెడ్డి యమున, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ మారం రాము, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నాగరాజు, మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి శ్రీధర్, ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంలు, జీపీల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
ఎగిరిన త్రివర్ణ పతాకం..
రాయపర్తి: తహసీల్‌లో తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బండారి రాజు, ఇందిరాక్రాంతి మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, పీఏసీఎస్‌లో చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, పీహెచ్సీలో వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, ఆయూష్ వైద్యాలయంలో డాక్టర్ రవికుమార్, పశువైద్యశాలలో డాక్టర్ వీరగోని శ్రుతి, శాఖ గ్రంథాలయంలో గ్రంథపాలకుడు అమీనానాయక్, అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరకాల: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వాసు చంద్ర, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శివరామయ్య, జూనియర్ సివిల్ జడ్జి కోర్డులో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి బీ హుస్సేన్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేశ్, తహసీల్‌లో తాసిల్దార్ జగన్మోహన్రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ కార్యాలయంలో డీఈ చంద్రు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, పట్టణంలోని పద్మనాయక వెలమ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఏసీపీ శివరామయ్య, పలు వార్డుల్లో కౌన్సిలర్లు జెండాలు ఆవిష్కరించారు.
మూడు రంగుల జెండా రెపరెపలు..
దామెర: ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కాగితాల శంకర్, తహసీల్‌లో తాసిల్దార్ రియాజొద్దీన్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌యాదవ్, రైతు వేదిక వద్ద రైతుబంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కోగిల్వాయిలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి మూడు రంగుల జెండాలను ఆవిష్కరించారు. అలాగే, అన్ని గ్రామాల్లోని జీపీల్లో సర్పంచ్‌లు పంద్రాగస్టు వేడుకలు జరిపారు. జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్ పాల్గొన్నారు.
గీసుగొండ: తహసీల్‌లో తాసిల్దార్ సుహాసిని, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ బొచ్చు వినయ్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాయల వెంకటేశ్వర్లు, పీహెచ్సీలో వైద్యాధికారి మాధవీలత, వ్యవసాయ కార్యాలయంలో ఏవో హరిప్రసాద్, పశువైద్యశాలలో వైద్యాధికారి రమేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేటర్ వరంగల్‌లోని 15వ డివిజన్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, 16వ డివిజన్ మున్సిపల్ కార్యాలయంలో సుంకరి మనీషా జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
అంబరాన్నంటిన సంబురాలు..
నడికూడ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండలవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. తహసీల్‌లో తాసిల్దార్ వీ మహేందర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మచ్చ అనసూర్య, నడికూడ జీపీలో సర్పంచ్ ఊర రవీందర్రావు, రైతువేదిక భవనం వద్ద రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ నారాగాని ఐలయ్య జాతీయ జెండాలను ఎగురవేశారు. మండలవ్యాప్తంగా జీపీల్లో సర్పంచ్‌లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
పర్వతగిరి: మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎగురవేశారు. తాసిల్దార్ మహబూబ్ అలీ, ఎంపీపీ కమల పంతులు, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, పర్వతగిరి సర్పంచ్ మాలతి, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్‌కుమార్‌గౌడ్, గొర్రె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.