
కమలాపూర్, ఆగస్టు 11 : ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించడంతో గొల్ల, కుర్మ, బీసీ వర్గాలు, విద్యార్థులు, యువతలో ఆనందం వెల్లివిరిసినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం కమలాపూర్‌లో గెల్లు శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ టికెట్ కేటాయింపుపై పటాకులు కాల్చి, స్వీట్లు పంపీణీ చేసి సంబురాలు జరిపారు. అనంతరం పది వేల మందితో విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి బస్టాండ్, రామాలయం, పనిగట్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గెల్లు శ్రీనివాస్‌పై 15 కేసులు ఉన్నాయని, సామాన్య పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అన్నారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు, యాదవ కులానికి చెందిన శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బీజేపీ నేత ఈటల రాజేందర్ అభివృద్ధి పనులు చేయడంలో విఫలమైనట్లు ప్రజలు చెబుతున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని, లక్ష మెజార్టీతో శ్రీనివాస్ గెలుస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పిలుపునిస్తే వేలాదిగా ప్రజలు తరలిరావడమే గెలుపునకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్‌రావు, నాయకులు నవీన్‌కుమార్, దశరథం, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం..
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చల్లా అన్నారు. బుధవారం మండలంలోని మర్రిపెల్లిగూడెం జీపీ పరిధిలోని జూజునూర్‌పల్లి, గోపాల్‌పూర్‌లో దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎ కేసీఆర్ చేస్తున్న కృషి వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోలేదని, ఓట్ల కోసమే వాడుకున్నట్లు విమర్శించారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే దళితబంధు పథకం పెట్టారన్నారు. ప్రజల కోసం పైసా పనిచేయని బీజేపీ నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలన్నారు. అభివృద్దిని అడ్డుకుంటున్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో? ప్రజలు ఆలోచన చేయాలన్నారు. జూజునూర్పల్లిలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
అనంతరం గోపాల్పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వక్కల రజితాశ్రీనివాస్, చెరిపెల్లి శ్రీనివాస్, వక్కల రమేశ్, వక్కల అవినాష్, కుమ్మరి కోమల, వక్కల సౌందర్య, చెరిపెల్లి కవిత, మంద రాజ్యలక్ష్మిలతో పాటు 60 మంది టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జీ డాక్టర్ పేరియాల రవీందర్రావు, సర్పంచ్ లడె గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, నవీన్‌కుమార్, పోరండ్ల రమేశ్, చెరిపెల్లి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.