
వరంగల్, ఆగస్టు 11 : కస్టమర్లకు నాణ్యతతో కూడిన వస్ర్తాలను అందిస్తూ వారి నమ్మకాన్ని పొందుతూ వస్త్ర వ్యాపారంలో ముందుకు సాగుతున్నామని కాసం గ్రూప్స్ చైర్మన్ కాసం నమఃశివాయ అన్నారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1945లో నాన్న కాసం పుల్లయ్య వరంగల్‌లో బట్టల వ్యాపారం ప్రారంభించారన్నారు. సుమారు 75 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొని దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు.
నాలుగు ఫ్లోర్లు, సెంట్రల్ ఏసీతో ఈ నెల 13న వరంగల్ స్టేషన్ రోడ్లో కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, సినీ నటి కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామన్నారు. లాభాపేక్ష ప్రామాణికం కాకుండా ప్రత్యేకంగా డిజైనర్లను ఏర్పాటు చేసుకొని సొంత మగ్గాలపై వస్ర్తాలు తయారు చేస్తున్నామన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మాంగళ్య షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లిలో మాల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సమావేశంలో కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, శివప్రసాద్, ప్రణీత్, సాయికృష్ణ, పూల్లూరి అరుణ్, పుల్లూరి వరుణ్, తోనుపునూరి కార్తీక్, తోనుపునూరి అరుణ్, యాంసాని ప్రవీణ్ పాల్గొన్నారు.