ఖిలావరంగల్, ఏప్రిల్ 28: పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే విషయాన్ని విద్యార్థులకు స్పష్టం గా తెలియజేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారు లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికా కుండా చూడాలని, అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు మానసిక వైద్యు లను సంప్రదించేందుకు వీలుగా 24 గంటలు అందుబాటులో ఉండే 18005999333 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టామన్నారు. ఈ నంబర్ ప్రతి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల దగ్గర కచ్చితంగా ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణం గా శానిటైజర్‌ను కూడా అందుబాటులో ఉంచాల న్నారు. పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎం లేదా ఆశ వర్కర్‌ను తప్పనిసరిగా నియమించడంతోపాటు అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోకు సూచిం చారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికమవుతున్న నేప థ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా టెంట్, తాగునీరు, ఏర్పాటు చేయాలన్నారు.
10వ తరగతి పరీక్ష కేంద్రాల వివరాలు
వచ్చే నెల 23 నుంచి జూన్ 1 వరకు పదో తర గతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తా రు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చింది. సబ్జెక్టు రెండు పేపర్లకు బదులు ఒక పేప ర్ను రూపొందించారు. అలాగే వరంగల్ జిల్లాలో మొత్తం 9940 మంది విద్యార్థులు 57 పరీక్ష కేంద్రాల్లో ఈ ఏడాది పదో తరగతి పరీక్ష రాసేందు కు సిద్ధమయ్యారు. కొవిడ్ నేపథ్యంలో 30 శాతం సిలబస్‌ను తొలగించారు.
జూన్ 12న టెట్ 
జూన్ 12 నుంచి టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్-2022 (టెట్) నిర్వహించనున్నారు. ఇందు కోసం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 38 కేంద్రాల్లో 9120 మంది అభ్యర్థులు పరీక్ష రాయ నున్నారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్
వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 14,663 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.