పంజాబ్ తరహాలో ప్రతిగింజనూ కేంద్రమే కొనాలి
ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలి
సాగునీటి ప్రాజెక్టులపై ఆంక్షలు ఎత్తేయాలి
24న ఇన్చార్జిల సన్నాహక సమావేశాలు
26న గ్రామ, 27న ఎంపీపీ, 30న జిల్లా పరిషత్‌ల తీర్మానాలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
క్యాంపు ఆఫీసులో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం
హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు
హనుమకొండ, మార్చి 21 : అన్నదాతకు వెనుదన్నుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగా ణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది. పార్టీ అధ్యక్షు డు, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం సా యంత్రం మంత్రుల నివాసంలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. వరంగల్, జనగామ, ములుగు, భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు సుధీర్‌కుమార్, పాగాల సం పత్రెడ్డి, కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, వరంగల్ మే యర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎ మ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూ రి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, న న్నపునేని నరేందర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కిషన్‌రావు, కృష్ణారెడ్డి, నూకల నరేశ్‌రెడ్డి, కేశవ్, సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కోసం ఓ ప్రత్యేక నిరసన, ఉద్యమ ప్రణాళికలను రూపొందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు, బీమా, సాగునీరు, 24 గంటల ఉచిత కరంటు, రుణమాఫీ, కల్లాలు, రైతు వేదికల వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంటే, కేం ద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ అన్నదాతలను మోసం చేస్తున్నదన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతుకు సున్నంపెట్టే విధంగా కేంద్ర వైఖరి ఉందని, ఈ వైఖరిని నిలదీస్తూ రైతులతో కలిసి పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ర్టానికో రీతిలో కా కుండా దేశవ్యాప్తంగా ఒకే నీతి ఉండేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో పం డిన గింజనూ కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. కొంత ధాన్యం, మరికొంత బియ్యం కాకుండా, నేరుగా ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనేలా నూత న వ్యవసాయ విధానాన్ని తేవాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న విజ్ఞప్తి మేరకు దేశవ్యాప్తంగా ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేశా రు. సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం పెడుతున్న ఆంక్షలను ఎత్తేయాలన్నారు. రైతు ఎంత కష్టపడినా వ్యవసాయంలో లాభాలు తకువేనని, వ్యవసాయాన్ని వ్యాపారంగా కాకుండా, సేవారంగంగా గుర్తించాలని డిమాం డ్ చేశారు.
గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు..
రైతాంగంపై కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణను రూపొందించిన ట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ నెల 24న ఇన్చార్జిలతో సన్నాహక సమావేశాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ నెల 24వ తేదీ న సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారని మంత్రి చెప్పారు. 26న గ్రామ, 27న ఎంపీపీ, 30న జిల్లా పరిషత్‌ల తీ ర్మానాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా ఈ నె ల 26న గ్రామ పంచాయతీలు, 27న మండల ప్రజాపరిషత్‌లు, 30న జిల్లా పరిషత్‌లు కేంద్ర రైతు వ్యతిరేక విధానాలు, వైఖరికి నిరసనగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సీఎం పిలుపు మేరకు ఈనెల 24, 25తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్రవాప్త ఆందోళనలు చేపట్టాలన్నారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని సూచించారు.
నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు..
నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించినట్లు మంత్రి తెలిపారు. ములుగు నియోజకవర్గానికి మంత్రి సత్యవతిరాథోడ్, నర్సంపేట నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మహబూబాబాద్‌కు జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, నూకల నరేశ్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌కు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పరకాల, భూపాలపల్లికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డోర్నకల్‌కు ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, వర్దన్నపేటకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, పాలకుర్తికి మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లును నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.