
రాయపర్తి, సెప్టెంబర్ 21: అన్ని వర్గాల సంక్షే మమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా మత్స్య శాఖ నేతృత్వంలో మత్య్సకారులకు ఉచితంగా సరఫరా చేసిన 28 వేల చేప పిల్లలను మంగళ వారం మండల కేంద్రంలోని చెరువులో మంత్రి ఎర్రబెల్లి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి విడుదల చేశా రు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడు తూ రాబోయే ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో వెను కబడిన వర్గాలన్నింటికీ ప్రభుత్వపరంగా ఆదుకు నేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్ర భుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని అన్నా రు. ప్రపంచమే అబ్బురపడేలా చేపడుతున్న దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబా లన్నీ ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అరవై ఏండ్ల పాటు కొ నసాగిన సీమాంధ్ర పాలకుల ఏలుబడిలో తెలం గాణ ప్రాంతంలోని కుల వృత్తులన్నీ ఆదరణ లేక కునారిల్లాయని చెప్పారు.
కుల, చేతి వృత్తుల వారి కి గ్రామాల్లో పనులు లేక పట్నాలకు వలస బాట పట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కుల, చేతి వృత్తుల కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆయన ముందు చూపు కారణంగానే నేడు పల్లెల న్నీ జలకళను సంతరించుకున్నట్లు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు అండగా నిలువాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఏటా రూ. కోట్లతో ఉచితంగా చేప పిల్లల ను పంపిణీ చేస్తున్న ట్లు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మండ లంలోని అన్ని గ్రా మాల ప్రజలు సద్వి నియోగం చేసుకో వాల్సిందిగా కోరారు.
అనంతరం మంత్రి, కలెక్టర్‌ను మత్స్య కారులు, గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, జిల్లా మత్స్య శాఖాధికారి నరేశ్‌కుమార్‌నాయుడు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వా మి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునా వత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినే టర్ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్ గారె నర్స య్య, ఎస్సారెస్పీ డీఈ కిరణ్ కుమార్, ఏఈ బాల దాసు, పీఆర్ ఏఈ కిరణ్‌కుమార్, కుసుమ తహసీ ల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోతు కిషన్‌నాయక్, ఎంఈవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీవో దొణికెల కుమార్గౌ డ్, ముద్రబోయిన సుధాకర్, ఎండీ నయీం, కాశీనాథం, గుగులోతు అశోక్‌నాయక్, గిర్దావర్ రాజు తదితరులు పాల్గొన్నారు.