
ములుగుటౌన్, సెప్టెంబర్ 21: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనులకు ప్రతిపాదన లు సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాల య ఆడిటోరియంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్ష తన 2022లో నిర్వహించనున్న మహాజాతర ఏర్పాట్లపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడారు. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర 2022 ఫిబ్రవరి 16,17, 18,19 తేదీల్లో జరుపుకునేందుకు ఆలయ పూ జారులు నిర్ణయించినట్లు తెలిపారు. ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులు పనులను గుర్తించి శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు అం దజేయాలన్నారు.
మేడారానికి నలువైపులా రహ దారుల మరమ్మతు పనులు, వర్షాలతో దెబ్బతిన్న రహదారుల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు అందించాలన్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల మరమ్మతుల కు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించేందుకు తాత్కాలిక, శాశ్వత పద్ధతిలో చేపట్టాలన్నారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్‌లను నిర్మించాలన్నారు.
అంతేకాకుండా బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌లను ఏర్పాటు చేయాలని అధి కారులను ఆదేశించారు. జాతర సమయంలో పా రిశుధ్య పనులు నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని పంచాయతీ అధికారులకు మంత్రి సూచించారు. కరోనా నేప థ్యంలో భక్తులకు అవసరమైన వైద్య సేవలు అం దించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. మేడారంతోపాటు కొండా యి, పూనుగుండ్ల గుడుల వద్ద అభివృద్ధి పనులను చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదే శించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీఎస్ ఆర్టీ సీ బస్సులు నడుపాలని, పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రామప్ప అభివృద్ధి పనులను అధికారులు మనుసుపెట్టి పూర్తి చేయాలన్నారు.
అధిక వర్షాలతో రామప్ప పరిసర రహదారులు మరమ్మతులకు గురవుతు న్నందున 11,800 క్యూసెక్కుల నీటిని రామప్ప చెరువు నుంచి వదిలినా తట్టుకునేలా కెనాల్ నిర్మించాలన్నారు. రామప్ప గుడి వాస్తు రోడ్డు, తూర్పు, పడమర రోడ్లు ఆలయానికి అనుగుణం గా నిర్మించాలన్నారు. రామప్ప ఆలయ అభివృద్ధి కి అనేక కంపెనీలు సీఎస్ఆర్ నిధులు అందిం చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సమా వేశంలో ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటి ల్, ఏఎస్పీ సాయిచైతన్య, డీఆర్వో రమాదేవి, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి మంకిడి ఎర్రయ్య, మేడారం ఈవో రాజేందర్, డీపీవో వెంకయ్య, డీఎంహెచ్‌వో అప్పయ్య, ఐటీడీఏ ఏపీవో వసం తా రావు, ఆర్టీసీ ఆర్ఎం విజయభాస్కర్, టూరి జం అధికారి శివాజీ, అధికారులు పాల్గొన్నారు.