
మడికొండ, సెప్టెంబర్ 21: మడికొండలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో మంగళవారం వర్ధన్న పేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో సుమా రు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ పార్టీ కండు వాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి అధ్యక్షత న ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మడికొండ గ్రామాభివృద్ధికి వర్ధ న్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి తోడ్పా టును అందిస్తానని అన్నారు. ఎమ్మెల్సీ నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని చెప్పారు.
రైతాంగం కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంట్, ఎరువులు, విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని, కుల మతాలకు అతీతంగా పండుగలను అధికారికంగా నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఏడే ళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగా లు భర్తీ చేసిందని, కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ర్టా నికి ఏం చేసిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభ జన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగా రం, మేడారంలో గిరిజన యూనివర్సిటీ వంటివి జాడలేవని అన్నారు. కార్యక్రమంలో 64వ డివిజన్ అధ్యక్షుడు పోలెపల్లి రామ్మూర్తి, మెట్టుగుట్ట చైర్మన్ బొల్లికొండ రవీందర్, పల్లపు రాజేందర్, ఆకుతోట ప్రశాంత్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.