
రాయపర్తి, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలోని రైతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు తండ్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం ఆవరణలో 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం నిర్మాణ పనులను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు సీఎం కృషిచేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం 39 గ్రామాల పరిధిలోని పలువురు రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేశారు. అదనపు కలెక్టర్ బానోతు హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, బీ రేఖ, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఎంపీడీవో గుగులోతు కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, పీఆర్ ఏఈ శేషం కిరణ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, విద్యుత్ శాఖ ఏఈ బానోత్ రాజశేఖర్, పీఏసీఎస్ సిబ్బంది ఏడాకుల సోమిరెడ్డి, గడ్డం యాకాంతం, అయిత మల్లేశ్, సంగెం రాకేశ్ పాల్గొన్నారు.
పార్టీని సమన్వయం చేయాలి
టీఆర్ఎస్ పార్టీని సమన్వయం చేయడంలో కార్యకర్తలు సమర్థులై ఉండాలని మంత్రి ఎర్రబెల్లి అనానరు. మండల కేంద్రంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 39 గ్రామాలకు 30 గ్రామాల్లో మాత్రమే టీఆర్ఎస్ కమిటీలు వేశారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి అనంతరం పలు అంశాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.