
వరంగల్, సెప్టెంబరు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని, జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారయంత్రాంగం అప్రమ త్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. వరదలు, జ్వరాల నియంత్రణ, రోడ్ల మరమ్మతులు, పాఠశాలల నిర్వహణ, వినాయక నవరా త్రో త్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లా ల అధికారులు, ప్రజాప్రతినిధులతో హనుమకొండ కలెక్టరేట్ లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో గ్రేటర్ వరం గల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ అధ్యక్షులు ఎం సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పోలీస్ కమిషనర్, రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జ్వరాల తీవ్రత పెరిగే పరిస్థితి ఉన్న క్రమంలో ముందు జాగ్రత్తలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడా లని చెప్పారు.
ప్రతి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలన్నారు. వరదల నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వ యంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వరదల నివారణ కోసం గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపట్టే వివిధ పనుల కోసం తక్షణమే టెండర్లు పిలువాలని సూచించారు.
అక్రమ నిర్మాణాలపై కఠి నంగా వ్యవహరించాలని ఆదేశించారు. గతేడాది వరదల అను భవంతో ఈ ఏడాది నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. గ్రామీణ రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచిం చారు. వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లు, రహదారుల గురించి ఆరా తీశారు. పారిశుధ్య నిర్వహణ, కరోనా జాగ్రత్తలు పాటించేందు కు వీలుగా ప్రతి స్కూలుకు ప్రత్యేకాధి కారిని నియమించుకో వాలని సూచించారు. పాఠశాలల్లో వసతుల కోసం ప్రభుత్వం ఈ ఏడాది విద్యాశాఖకు రూ.8వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. సదుపాయాల కల్పనపై కలెక్టర్లు శ్రద్ధ చూపాలని సూ చించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రతి మండలానికి రూ.50లక్షలు కేటాయిస్తుట్లు తెలిపారు. వినాయ క నవరాత్రోత్సవాలను ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూ చించారు. చెరువుల దగ్గర పంచాయతీరాజ్, పోలీస్ శాఖల పర్యవేక్షలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
పనులు త్వరగా పూర్తిచేయాలి: చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
వరదల నివారణ కోసం శాశ్వత ప్రతిపాదకన చేపట్టిన పను లు త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాసర్ ఆదేశించారు. హన్మకొండలోని అమరావతినగర్, సమ్మయ్య నగర్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ రోడ్ల పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, పంచాయతీరాజ్, విద్యా శాఖలు సమన్వయంతో పని చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య సూచించా రు. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ శివారు గ్రామాల్లో వరదల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. తూర్పు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సంతోషిమాత గుడి ప్రాంతంలో వరద నీరు సులభంగా వెళ్లేందుకు వీలుగా పనులు చేయాలని సూచించారు.
మానవీయ విలువలను చాటిన వ్యక్తి కాళోజీ: ఎర్రబెల్లి
హనుమకొండ: తెలంగాణ కోసం నిరంతరం పరితపించిన కాళోజీ నారాయణరావు మానవీయ విలువలను చాటారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా ఆయనకు నమస్సుమాంజలులు తెలుపుతూ ప్రజలకు తెలంగాణ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆయన జయంతిని తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించి ఏటా కాళో జీ స్మారక పురస్కారాలు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఉమ్మ డి జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.