లక్నో: రంజీ ట్రోఫీ సెమీస్ పోరును కర్ణాటక తొలిరోజు ఘనంగా ఆరంభించింది. లక్నోలో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (211 బంతుల్లో 141, 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ దేవ్‌దత్ పడిక్కల్ (236 బంతుల్లో 148 నాటౌట్, 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో రాణించారు. ఈ ఇద్దరి సెంచరీలతో మొదటిరోజు కర్ణాటక 90 ఓవర్లకు 355/2 పరుగుల భారీ స్కోరు సాధించింది.
జమ్మూకాశ్మీర్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న బెంగాల్.. మొదటి రోజు 249/5 చేసింది. సుదీప్ కుమార్ (136 బ్యాటింగ్) సెంచరీ చేశాడు.