హైదరాబాద్, ఆట ప్రతినిధి: బాలీ(ఇండోనేషియా) వేదికగా ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న ఇండో-ఇండోనేషియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు బాబునాయక్, శశిధర్ ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు తరఫున బాబునాయక్, శశిధర్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
జాతీయస్థాయి టోర్నీల్లో రాణించడం ద్వారా ఈ ఇద్దరు గురుకుల విద్యార్థులు అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైనట్లు గురుకుల ప్రతినిధులు పేర్కొన్నారు.