కన్నడ సొగసరి రుక్మిణి వసంత్ తారాపథంలో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వంటి భారీ చిత్రాల్లో నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంతార ఛాప్టర్-1’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆమె పాపులర్ అయింది. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు వరిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నాయికగా ఖరారుకాబోతున్నదని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. అగ్ర హీరో రామ్‌చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. వచ్చే నెల లాంఛనంగా ప్రారంభించి..నవంబర్‌లో సెట్స్‌మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం పలువురు అగ్ర నాయికల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వారిలో రుక్మిణి వసంత్ ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ధృవీకరించాల్సిందే.