చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ ద్వయం హర్మీత్ దేశాయ్, యశస్విని ఘోర్పడె డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
ఆదివారం ఇక్కడ జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత జోడీ.. 0-3 (9-11, 2-11, 8-11)తో రొమానియా సెకండ్ సీడ్ ఎడ్వర్డ్, బెర్నాడెట్ చేతిలో ఓడింది.