రఘునాథపల్లి : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్యను టీఆర్ఎస్ నాయకులు హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్యను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొంరయ్య శివాజీనగర్, మల్లంపల్లి గ్రామాల్లో ఐకెపి ద్వారా ఏర్పాటు చేయనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరి చేయాలని వినతి పత్రం అందించి కోరారు.
ఈ మేరకు ఎమ్మెల్యే రాజయ్య సానుకూలంగా స్పందించి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన్నట్లు కొంరయ్య తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్యను కలిసిన వారిలో టీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు తిప్పారపు మమత, కార్యదర్శి తిప్పారపు రమ్య, నాయకులు బుస్సారి రాజేశ్వర్‌రావు, బుస్సారి లక్ష్మణ్, పొలిశెట్టి జగదీష్, ఓరుగంటి గణేష్, కుంచం వడ్డయ్య, పొన్నాల యాదగిరి, బొంత మల్లేష్, శివరాత్రి కిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.