లింగాల గణపురంలో : రజక కులస్తులు మల్లన్న దేవుడికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. రజక కులస్తులు కొన్నేళ్ల క్రితం బైరోని బావి దగ్గర మల్లన్న గుడిని నిర్మించుకొని పూజలు కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఉగాది పండగ పర్వదినం నాడు ప్రతి ఇంటి నుంచి బోనాన్ని తీసుకెళ్లి సమర్పించి ముక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ క్రమంలో బోనాలు సమర్పించి తమ పిల్లాపాపలను, గుడ్డు గోధులను చల్లంగా చూడమని, చేస్తున్న వృత్తి వ్యాపారంలో అభివృద్ధి చెందేలా దీవించమని స్వామిని వేడుకున్నారు. కార్యక్రమంలో ఏదునూరి యాదగిరి, వీరన్న సోమ నరసయ్య, శ్రీశైలం, పద్మ, పుష్ప, రేణుక, తదితరులు పాల్గొన్నారు.